Vishwak Sen 'HIT'.. సీక్వెల్ హీరో అతడేనా?


పెద్దగా అంచనాలు లేకుండా గత ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన 'హిట్' మూవీ ఏ రేంజ్ లో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. నాని వాల్ పోస్టర్ ప్రొడక్షన్ లో విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఆ సినిమా వచ్చి నిన్నటితో ఏడాది అయ్యింది. అయితే రీసెంట్ గా నాని ఆ విషయాన్ని గుర్తు చేస్తూ సీక్వెల్ పై కూడా క్లారిటీ ఇచ్చాడు.

అసలు మ్యాటర్ లోకి వస్తే ఈ సినిమా సీక్వెల్ లో నటించబోయే హీరో ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విశ్వక్ సేన్ అయితే మళ్ళీ నటించడనే టాక్ గట్టిగానే వస్తోంది. ఇక ఈ సారి మరో టాలెంటెడ్ హీరో అడివి శేష్ ఈ థ్రిల్లర్ జానర్ ను టచ్ చేయవచ్చని టాక్ వస్తోంది. గతంలో క్షణం, గూఢచారి వంటి సినిమాలతో మంచి థ్రిల్ ఇచ్చిన అడివి శేష్ ఇలాంటి కాన్సెప్ట్ కు తప్పకుండా న్యాయం చేయగలడని చెప్పవచ్చు. మరి ఈ రూమర్ ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.



Post a Comment

Previous Post Next Post