క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి పాన్ ఇండియా స్థాయికి వచ్చిన రౌడి స్టార్ విజయ్ దేవరకొండ నెక్స్ట్ లైగర్ సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. అయితే తన స్థాయి ఎంత పెరిగినా కూడా తోటి వారి కోసం ఎదో ఒక రకంగా హెల్ప్ అవుతూనే ఉన్నాడు. ఈ నగరానికి ఏమైంది?, మీకు మాత్రమే చెప్తా వంటి సినిమాల్లో అతిధి పాత్రలో మెరిసిన విషయం తెలిసిందే.
ఇక మరోసారి జాతిరత్నాలు సినిమాలో కూడా ఒక బ్లూ షర్ట్ అబ్బాయిగా మెరిసాడు. ఇక ప్రస్తుతం నాని సినిమా కోసం కూడా ఒక గెస్ట్ రోల్ లో కనిపించడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇదివరకే వీరిద్దరు ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇక నెక్స్ట్ శ్యామ్ సింగరాయ్ సినిమాలో కూడా విజయ్ ఒక స్పెషల్ పాత్రలో కనిపించే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది. ఈ సినిమా దర్శకుడు రాహుల్ విజయ్ తో ట్యాక్సీ వాలా సినిమాతో హిట్టు కొట్టిన విషయం తెలిసిందే. దర్శకుడు క్లోజ్ కాబట్టి అడిగిన వెంటనే ఒప్పేసుకున్నట్లు టాక్ వస్తోంది.
Follow @TBO_Updates
Post a Comment