Varun Tej 'Ghani' to get new release date?


మెగా హీరో వరుణ్ తేజ్ మొత్తానికి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో తన మార్కెట్ పరిధిని పెంచుకుంటున్నాడు. ఇక నెక్స్ట్ అతని నుంచి రాబోతున్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ గని. కొత్త దర్శకుడు కిరణ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై ఓ వర్గం అభిమానుల్లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఎందుకంటే వరుణ్ తేజ్ మొదటిసారి బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తున్నాడు.

ఇక ఈ సినిమా కోసం వరుణ్ న్యూ ఫిట్నెస్ తో కనిపించబోతున్నాడు. అయితే సినిమాను జూలై 30న రిలీజ్ చేయనున్నట్లు కొన్నిరోజుల క్రితం క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే అదే రోజు ప్రభాస్ రాధేశ్యామ్ కూడా రాబోతున్నట్లు క్లారిటీ ఇవ్వడంతో గని యూనిట్ రిలీజ్ డేట్ ను మార్చే పనిలో పడింది. ఆగస్టులో కూడా పెద్ద సినిమాలే ఉన్నాయి కాబట్టి సరైన డేట్ కోసం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయంపై క్లారిటి ఇవ్వనున్నారు.



Post a Comment

Previous Post Next Post