టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొంతకాలంగా వరలక్ష్మీ శరత్ కుమార్ పేరు మారు మ్రోగిపోతోంది. తమిళ్ లో కంటే కూడా తెలుగు ఆడియెన్స్ అమితంగా ఆదరిస్తున్నారు అంటూ ఆమె నోటి నుంచి మాట వచ్చింది అంటే ఆఫర్స్ కూడా గట్టిగానే వస్తున్నట్లు అర్ధమవుతోంది. మొత్తానికి క్రాక్, నాంది సినిమాల్లో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.
ఒకప్పుడు హీరోయిన్ గా దక్కిన క్రేజ్ కంటే ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ ద్వారానే చాలా ఎక్కువ క్రేజ్ వస్తోంది. సినిమాలు హిట్టవ్వడమే కాకుండా ఆమె కోసం మరిన్ని అవకాశాలు వచ్చేలా చేస్తున్నాయి. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ ,కొరటాల శివ సినిమాలో కూడా నటించే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది. అలాగే అఖిల్ సురేంధర్ రెడ్డి కాంబినేషన్ లో మొదలు కానున్న బిగ్ బడ్జెట్ సినిమాలో కూడా ఈ టాలెంటెడ్ యాక్టర్ నటించే అవకాశం ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. మరి ఈ రూమర్స్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
Follow @TBO_Updates
Post a Comment