VakeelSaab @ Trailer Review!!


పవన్ కళ్యాణ్ పింక్ సినిమా రీమేక్ ఎనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి కూడా చాలా మంది విమర్శలు చేస్తూనే ఉన్నారు. అలాంటి కథకు వకీల్ సాబ్ టైటిల్ ఏ మాత్రం సెట్టవ్వలేదని ట్రోల్ చేశారు. ఇక టీజర్ లో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువయ్యాయని కామెంట్స్ కూడా వచ్చాయి.  అయితే ట్రైలర్ తో పవర్ స్టార్ కౌంటర్లకు రీ కౌంటర్లు ఇచ్చేశారు.

ఉమెన్స్ రైట్స్ పై అసలైన పాయింట్ ను ట్రైలర్ లో చూపించే ప్రయత్నం చేశారు. కోర్టు సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ డైలాగ్స్ తోనే చాలా క్లారిటీగా అర్ధమయ్యింది సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అని.. వకీల్ సాబ్ ని అన్ని వర్గాల ఆడియెన్స్ కు నచ్చే విధంగా డిజైన్ చేసినట్లు చెప్పేశారు. ఇక ట్రైలర్ విడుదలైన 7నిమిషాల్లోనే యూ ట్యూబ్ లో 100k లైక్స్ తో న్యూ రికార్డ్ క్రియేట్ చేసింది. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్ అని అర్థమైపోయింది. మరి సినిమా ఏప్రిల్ 9న ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి.


Post a Comment

Previous Post Next Post