Uppena breaks 21years Indian Cinema Record!!


టాలీవుడ్ లో ఈ ఎడాది విడుదలైన సినిమాల్లో అత్యదిక షేర్స్ అందుకున్న సినిమాగా ఉప్పెన నిలిచింది. చాలా విషయాల్లో ఉప్పెన గత బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది. ఇప్పటికే బెస్ట్ టాలీవుడ్ డెబ్యూ హీరోగా వైష్ణవ్ తేజ్ మంచి క్రేజ్ అందుకున్నాడు. అన్నయ్య రామ్ చరణ్ చిరుత రికార్డును సైతం బ్రేక్ చేసి అత్యదిక వసూళ్లు అందుకున్నాడు.

అయితే కృతి శెట్టికి కూడా ఈ సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది. ఇక వీరిద్దరు కలిసి 21 ఏళ్ళ రికార్డును సైతం బ్రేక్ చేశారు. 2000వ సంవత్సరంలో బాలీవుడ్ లో వచ్చిన "కహి నా.. ప్యార్ హై" అనే సినిమాతో హృతిక్ రోషన్ అమీషా పటేల్ హీరో హీరోయిన్స్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇండియానే బెస్ట్ డెబ్యూ సినిమాగా క్రేజ్ అందుకున్న ఆ సినిమా 41కోట్ల షేర్స్ అందించింది. ఇక మళ్ళీ ఇన్నాళ్లకు వైష్ణవ్, కృతి శెట్టిలు న్యూ ఎంట్రీతో ఆ రికార్డును బ్రేక్ చేశారు. నిజానికి అప్పట్లో 40కోట్లు అంటే చాలా పెద్ద రికార్డ్. ఇక నెంబర్ల ప్రకారం చూస్తే ఈ కొత్త జంట మొదటి స్థానంలో నిలిచింది.



Post a Comment

Previous Post Next Post