పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఒకవైపు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తుండగా మరోవైపు అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ సినిమా చేస్తున్నాడు. అయితే ఇటీవల ఈ మళయాళం రీమేక్ పై ఒక రూమర్ వచ్చిన విషయం తెలిసిందే.
అందులో పవన్ కు జోడిగా నటించనున్న సాయి పల్లవి సినిమా నుంచి తప్పుకున్నట్లు రూమర్స్ వచ్చాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. దర్శకుడు సాగర్ చంద్రను ఈ విషయంపై సంప్రధించగా అవన్నీ రూమర్స్ అని కొట్టి పారేశారు. ఇక సాయి పల్లవి పవన్ సినిమా కోసం మొదట కొంత డేట్స్ అడ్జస్ట్ చేయడానికి ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. ఫైనల్ గా చిత్ర యూనిట్ సపోర్ట్ తో ఆమె డేట్స్ తనకు అనుకూలంగా సెట్ చేసుకున్నట్లు సమాచారం.
Follow @TBO_Updates
Post a Comment