ఇంతవరకు ఫెయిల్యూర్ చూడని అతికొద్ది మంది దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద పవర్ఫుల్ వసూళ్లను అందుకుంటున్నాయి. ఇక నెక్స్ట్ F3 సినిమాతో మరో బాక్సాఫీస్ హిట్ కొట్టడానికి సిద్ధమవుతున్నాడు. ఇక అనిల్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ లపై వస్తున్న రూమర్స్ గురించి కూడా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు.
సరిలేరు నీకెవ్వరు అనంతరం మహేష్ బాబుతోనే మరో సినిమా ఉంటుందని షూటింగ్ దశలోనే కమిట్మెంట్ తీసుకున్న అనిల్ అనంతరం బాలకృష్ణతో కూడా సినిమా చేయాలని చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఇంకా వాళ్లిద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. రామ్ తో కూడా ఒక సినిమా చేయాల్సి ఉందని గతంలో రాజా ది గ్రేట్, పటాస్ సినిమాలు మొదట ఆ హీరోకే చెప్పినప్పటికి కుదరలేదని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. అనిల్ గాలి సంపత్ అనే సినిమాకు ప్రెజెంటర్ గా ఉంటూ స్క్రీన్ ప్లే అందించిన విషయం తెలిసిందే. ఆ సినిమా మార్చ్ 11న రానుంది.
Follow @TBO_Updates
Post a Comment