యమదొంగ సినిమాలో చిన్నప్పటి ఎన్టీఆర్ పాత్రలో నటించిన కీరవాణి గారి అబ్బాయి శ్రీ సింహా ప్రస్తుతం కథానాయకుడిగా నిరూపించుకోవాలని చాలానే కష్టపడుతున్నాడు. మొదట మత్తు వదలరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యువ హీరో ఇప్పుడు ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద హిట్టు కొట్టాలని 'తెల్లవారితే గురువారం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శనివారం విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం..
కథ:
కన్ స్ట్రక్షన్ కంపెనీతో బిజినెస్ చేస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండే కుర్రాడు వీరు (శ్రీ సింహా). అయితే ఒకరోజు అనుకోకుండా తండ్రి బలవంతపు నిర్ణయంతో మధు (మిశా నారంగ్)ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధం కావాల్సి వస్తుంది. తెల్లవారితే గురువారం పెళ్లి అనగా అక్కడి నుంచి జంప్ అవుతాడు. ఇక ఆ తరువాత పెళ్లికూతురు మధు (మిశా నారంగ్) కూడా వెళ్లిపోతుంది. అసలు పెళ్లి నుంచి ఇద్దరు ఒకేసారి ఎందుకు పారిపోయారు. ఈ ఇద్దరి పరిస్థితులు ఆ తరువాత ఎలాంటి మలుపులు తిరిగాయి. కలిసి ఏం చేశారు? తెల్లవారితే గురువారం కాన్సెప్ట్ వెనుక ఉన్న అసలు ట్విస్ట్ ఏమిటనేది పూర్తి సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఫస్ట్ హాఫ్:
ఫస్ట్ హాఫ్:
ఫస్ట్ హాఫ్ లో సినిమా అసలు కథను చెప్పి చెప్పకుండా దర్శకుడు కొంత తెలివిగా రాసుకున్నట్లు అర్ధమవుతుంది. పలు కామెడీ సన్నివేశాలు పంచ్ లు బాగానే ఉన్నాయి. ఇక అసలు కథలోకి వెళ్లడం కోసం పెళ్లి నుంచి పారిపోయిన హీరో హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీలు మొదలవుతాయి. కొన్ని చోట్ల కామెడీ సీన్స్ వర్కౌట్ అయినప్పటికీ కథనం పరంగా ఫస్ట్ హాఫ్ కొంత నిరసంగానే సాగుతుంది. చాలా వరకు డ్రామా ఎపిసోడ్స్ రోటీన్ గా అనిపిస్తాయి. సత్య కామెడీ సినిమాకు కొంత మేజర్ ప్లస్ పాయింట్. వైవా హర్ష కూడా తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు.
సెకండ్ హాఫ్:
ఇక సెకండ్ హాఫ్ లో అయినా ఎదో ట్విస్ట్ ఇస్తాడాని అనుకుంటే దర్శకుడు ఆడియెన్స్ ఆశ్చర్యపోయేంత రేంజ్ లో ఏమి సంతృప్తినివ్వలేదు. ఏదో రొటీన్ సినిమా చూసినట్లు అనిపిస్తుంది. హీరోయిన్స్, హీరో సెకండ్ హాఫ్ లో ట్రాక్స్ కూడా చాలా బోరింగ్ గా ఉన్నాయి. దర్శకుడు ఫన్ క్రియేట్ చేసినంత ఈజీగా మిగతా ఎపిసోడ్స్ ను ఎట్రాక్ట్ చేసే విధంగా అయితే హ్యాండిల్ చేయలేకపోయాడు. సెకండ్ హాఫ్ పై ఇంకాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. అక్కడక్కడా కొన్ని కామెడీ సీన్స్ తప్పితే సినిమాలో ఆహా అనిపించే కంటెంట్ ఏమి లేదు.
ఫైనల్ గా:
శ్రీ సింహా నటుడిగా అయితే మెప్పించాడు. హీరోయిన్స్ కూడా వారి పాత్రలకు బాగానే న్యాయం చేశారు. సిరి హనుమంత్, రాజీవ్ కనకాల, శరణ్య ప్రదీప్ వంటి నటులు వారి పాత్రలకు న్యాయం చేశారు. ఇక సినిమాలో సాంగ్స్ అంతగా క్లిక్కవ్వలేదు. కీరవాణి పెద్ద కుమారుడు కాల బైరావ మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకు సింక్ అయినట్లు అనిపించలేదు. ఇక కెమెరా పనితనం, సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి. ఫైనల్ గా సినిమాలో సెకండ్ హాఫ్ పై ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే సినిమాకు మౌత్ టాక్ ద్వారా మంచి పబ్లిసిటీ వచ్చి ఉండేది.
ప్లస్ పాయింట్స్:
ఫస్ట్ హాఫ్
సత్య కామెడీ సీన్స్
నెగిటివ్ పాయింట్స్
స్క్రీన్ ప్లే
సెకండ్ హాఫ్ బోరింగ్ సీన్స్.
మ్యూజిక్
రేటింగ్: 2.25/5
Post a Comment