రెగ్యులర్ గా కాకుండా కాస్త వినూత్నంగా క్రియేటివ్ గా ఆలోచించే అతికొద్ది మంది దర్శకుల్లో సుకుమార్ ఒకరు. రంగస్థలం లాంటి బాక్సాఫీస్ హిట్ అనంతరం పుష్పతో పాన్ ఇండియా లెవెల్లో తన టాలెంట్ చూపించుకోవడానికి రెడీ అయ్యారు. ఆ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే పుష్ప అనంతరం సుకుమార్ విజయ్ దేవరకొండతో ఒక సినిమాను చేయాలని అనుకున్న విషయం తెలిసిందే.
ఆ సినిమా వార్ బ్యాక్ డ్రాప్ లో పాన్ ఇండియా లెవెల్లోనే నిర్మిస్తారని టాక్ గట్టిగానే వచ్చింది. అయితే ఆ సినిమాకు సంబంధించిన పూర్తి కథ ఇంకా సెట్టవ్వలేదట. పుష్ప అనంతరం సుకుమార్ మరికొన్నాళ్లు స్క్రిప్ట్ పై కూర్చోవాల్సిందేనని టాక్ వస్తోంది. అయితే అప్పటి వరకు విజయ్ ఖాళీగా ఉండడు కాబట్టి వేరే హీరో కోసం అనుకున్న ప్రాజెక్టును ను లైన్ లో పెట్టనున్నట్లు టాక్ వస్తోంది. ఆ కథ లాక్ డౌన్ లోనే ఆల్ మోస్ట్ రెడీ అయ్యిందట. అందుకే విజయ్, సుకుమార్ ప్రాజెక్టుకు కొంత గ్యాప్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు టాక్. ప్రస్తుతం విజయ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
Follow @TBO_Updates
Post a Comment