టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్స్ సినిమాలు విడుదలైన మొదటి వీకెండ్ లోనే సాలీడ్ కలెక్షన్స్ అందుకోవడం సహజం. టిక్కెట్ల రేట్లు ఎంత పెంచినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ అస్సలు తగ్గరు. ఇక స్పెషల్ షోలు పడితే ఆ కిక్కే వేరు. ఇక దిల్ రాజు కూడా ప్రస్తుతం అలాంటి ప్లాన్స్ వేస్తున్నట్లు తెలుస్తోంది. వైజాగ్ లో సింగిల్ స్క్రీన్స్ లలో స్పెషల్ షోలను ప్లాన్ చేస్తున్నారట.
రెండు థియేటర్స్ లలో మిడ్ నైట్ షోలకు గాను ఒక్కో టిక్కెట్ ధర 1500రూపాయల ధరను ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇక 14 థియేటర్లలో స్పెషలు షోలు తెల్లవారు జామున 4గంటలకు మొదలు కానున్నాయి. ఉదయం 7గంటలకు కూడా షోలు వేయనున్నారు. ఆ షోలకు సంబంధించిన టిక్కెట్ ధర 500రూపాయలు ఉన్నట్లు సమాచారం. ఇక డైలీ టైమింగ్స్ లో పడే షోలకు రెగ్యులర్ రేట్లను మాత్రమే ఫిక్స్ చేశారు. మరి ఈ రేట్లతో దిల్ రాజు ఏ స్థాయిలో లాభాలను అందుకుంటాడో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment