సమంత అక్కినేని ఇన్నేళ్ల కెరీర్ లో ఎన్నో రకాల పాత్రలు చేసింది గాని ఒక్క పిరియాడిక్ హిస్టారికల్ కథలలో మాత్రం నటించలేదు. ఇక ఆమెతో మొదటిసారి దర్శకుడు గుణశేఖర్ శాకుంతలం సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆఫర్ తో సమంత తన డ్రీమ్ నిజమైనట్లు చెప్పుకుంటోంది. శాకుంతలం కథను మహాభారతం ఆదిపర్వంలోని శాకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా రూపొందిస్తున్నారు.
ఇక గుణశేఖర్ హోమ్ బ్యానర్ తో పాటు దిల్ రాజు కూడా సినిమాను సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. అయితే సినిమా బడ్జెట్ తన మార్కెట్ కు మించి చాలా ఎక్కువగా ఉందని సమంత ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చింది. ఇక లేటెస్ట్ అందిన సమాచారం ప్రకారం సినిమాకు మొత్తంగా 45 నుంచి 50కోట్ల మధ్యలో ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. సినిమా సెట్స్ లలోనే ఎక్కువగా చిత్రీకరించనున్నారట. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను స్టార్ట్ చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు.
Follow @TBO_Updates
Post a Comment