టాలీవుడ్ మిస్టర్ కూల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల మెల్లమెల్లగా తన మేకింగ్ స్టైల్ ను మార్చేస్తున్నారు. కొత్త వారితో కాకుండా స్టార్ క్యాస్ట్ ను లైన్ లో పెడుతున్నాడు. ఫిదా లాంటి బ్లాక్ బస్టర్ అనంతరం చాలా గ్యాప్ తీసుకున్న ఈ హ్యాపీ డేస్ దర్శకుడు నెక్స్ట్ అదే తరహాలో ఆకట్టుకోవలని లవ్ స్టొరీతో సిద్ధమయ్యాడు.
ఇక లవ్ స్టొరీ అనంతరం శేఖర్ కమ్ముల ఒక సీనియర్ స్టార్ హీరోతో వర్క్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. వెంకటేష్ దగ్గుబాటిని కూడా లైన్ లో పెట్టినట్లు సమాచారం. అరణ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే వెంకటేష్ తో త్వరలోనే వర్క్ చేయలని అనుకుంటున్నట్లు చెప్పిన కమ్ముల ఇటీవల ఒక స్టోరీ లైన్ వినిపించినట్లు సమాచారం. వెంకటేష్ కూడా దర్శకుడి మీద నమ్మకంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక లవ్ స్టొరీ రిలీజ్ అనంతరం శేఖర్ కమ్ముల ఆ కొత్త కథపై ఫోకస్ పెట్టబోతున్నాడు.
Follow @TBO_Updates
Post a Comment