సాహో సినిమాతో బాక్సాఫీస్ హిట్టు కొట్టి తన సత్తాను నిరూపించుకోవాలని అనుకున్న యువ దర్శకుడు సుజిత్ అనుకున్నంత రేంజ్ లో హిట్టు కొట్టలేకపోయాడు. సాహో సౌత్ ఇండస్ట్రీలో దారుణంగా డిజాస్టర్ అయినప్పటికీ బాలీవుడ్ లో మాత్రం మంచి క్రేజ్ అందుకుంది. పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలను అందించడంతో అక్కడ అతనికి ఆఫర్స్ చాలానే వచ్చాయి.
మొత్తానికి తదుపరి సినిమాలను జీ స్టూడియోస్ లో చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇక హీరో విషయంలో ఇంకా అఫీషియల్. క్లారిటీ ఇవ్వలేదు గాని ఒక పవర్ఫుల్ పాత్ర కోసం దర్శకుడు ముందుగానే కన్నడ హీరో కిచ్చా సుదీప్ ను సెలెక్ట్ చేసుకున్నట్లు టాక్ వస్తోంది. ఇటీవల బెంగుళూరు వెళ్లిన సుజిత్ అక్కడ సుదీప్ కు కథ కూడా చెప్పాడట. అయితే అతను ఒప్పుకున్నాడా లేదా అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలోనే సుజిత్ తన బాలీవుడ్ బిగ్ బడ్జెట్ సినిమాపై ఫుల్ క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం.
Follow @TBO_Updates
Post a Comment