టాలీవుడ్ బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ RRRపై అంచనాలు రోజురోజుకు అకాశాన్ని దాటేస్తున్నాయి. సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఇక సోమవారం అలియా భట్ పుట్టినరోజు సందర్భంగా సీత పాత్ర యొక్క ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. అయితే ఒక స్టార్ హీరో సినిమాలో పలు కీలకమైన సీన్స్ ను ముందే చూశారని తెలుస్తోంది.
ఆ హీరో మరెవరో కాదు. మెగాస్టార్ చిరంజీవి. సినిమాలో అత్యంత కీలకమైన యాక్షన్ సీన్స్ ను అలాగే ఎమోషనల్ సన్నివేశాల్ని మెగాస్టార్ ఇటీవల రఫ్ కట్ చూశారని తెలుస్తోంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా రష్ చూసినప్పటికి మెగాస్టార్ ఎంతో థ్రిల్ గా ఫీల్ అయ్యారని తెలిసింది. ఆయన సన్నిహితులతో ఈ విషయాన్ని షేర్ చేసుకోవడంతో ఆ టాక్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఇక RRR సినిమాను అక్టోబర్ 13న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే.
Follow @TBO_Updates
Post a Comment