RRR వెయ్యి కోట్ల బిజినెస్ చేయగలదని బిజినెస్ కు సంబందించిన డీల్స్ తోనే అర్ధమవుతోంది. సినిమా మార్కెటింగ్ పై రోజుకో రూమర్ అభిమానుల్లో అంచనాల డోస్ ను పెంచుతోంది. ఇక ఇటీవల సెట్టయిన ఒక డీల్ తో పెట్టిన బడ్జెట్ అయితే సగం వెనక్కి వచ్చినట్లు సమాచారం. సినిమా కోసం దాదాపు 450కోట్ల వరకు ఖర్చవుతుందని ముందే ఒక క్లారిటీ ఇచ్చారు.
రీసెంట్ గా సినిమా అన్ని బాషలకు సంబందించిన డిజిటల్ రైట్స్ ద్వారా బడ్జెట్ లో దాదాపు 50% రికవరీ అయినట్లు టాక్ వస్తోంది. ఆ దారిలో సినిమా 225కోట్లు తెచ్చిపెట్టినట్లు సమాచారం. అంటే ఇంకా మరో 225కోట్లు వస్తే పెట్టుబడి మొత్తం వెనక్కి వచ్చినట్లే. ఆ టార్కెట్ అందుకోవడం మన హీరోలకు పెద్ద కష్టమేమి కాదు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ సోలోగా వస్తనే బాక్సాఫీస్ రికార్డులు బద్దలవుతాయి. ఇక ఇద్దరు కలిసి రాజమౌళి తో వస్తున్నారు అంటే దెబ్బ మాములుగా ఉండదు.
Follow @TBO_Updates
Post a Comment