పక్క ఒక్కనే ఇల్లులు ఉండడం వలన చిన్నప్పటి నుంచి అర్జున్ (నితిన్), అనుపమ (కీర్తి సురేష్) స్నేహితులుగా ఉంటారు. అను స్టడీస్ లో టాపర్. ఇక అర్జున్ ఆ రేంజ్ లో చదవకపోవడంతో తండ్రి(నరేష్) అతన్ని ఎప్పుడూ ఆమె ముందు తక్కువ చేస్తూ ఉంటాడు. అర్జున్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ పరీక్షలను క్లియర్ చేయడానికి కొన్ని విభిన్నమైన పద్ధతులలో వెళతాడు. ఇక అను అంటే ఇష్టపడని అర్జున్ ఒక ఊహించని సంఘటన వల్ల పెళ్లికి సిద్ధం కావాల్సి వస్తుంది. ఇక ఇద్దరు కూడా ఉన్నత చదువుల కోసం దుబాయ్ వెళ్తారు. ఇక ఆ తరువాత వారిద్దరి మధ్య సాగిన కథ ఏంటి? చివరికి తనను ఇష్టపడని అర్జున్ కోసం అను ఎలాంటి నిర్ణయం తీసుకుంది? అనే విషయాలను వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
ఫస్ట్ హాఫ్:
చిన్న చిన్న ఫీలింగ్స్ తో కూడా అద్బుతమైన కథలను రాయవచ్చని దర్శకుడు వెంకీ అట్లూరి ఇదివరకే తొలిప్రేమ సినిమాతో తానేంటో నీరూపించుకున్నాడు. ఇక రంగ్ దే సినిమాలో కూడా చిన్న చిన్న గొడవల్లో ఒక మినీ యుద్ధమే ఉంటుందని చెప్పే ప్రయత్నం చేస్తూనే అందులో మంచి ఫన్ క్రియేట్ చేశాడు. ఫస్ట్ హాఫ్ పాత్రలను పరిచయం చేస్తూ వాటి స్వభావాలను ఆడియేన్స్ కు కనెక్ట్ చేశారు. కథ పరంగా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చెప్పేసిన వెంకీ అక్కడక్కడా కొన్ని సీన్స్ లలో పూర్తి స్థాయిలో మెప్పించలేడు. ఫస్ట్ హాఫ్ మీడ్ లో కథ నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది. ఇక పదేళ్ల క్రితం వాతావరణంలో పిల్లలు ఎలా ఉండేవారు అనే విషయాన్ని బాగానే హైలెట్ చేశారు. అయితే వీలైనంత వరకు ప్రతి సీన్ లో కామెడీ టచ్ ఇస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. నితిన్ GMATకు సంబంధించిన సీన్స్ అలాగే బ్రహజీ సీన్స్ ఫస్ట్ హాఫ్ లో హైలెట్ గా నిలిచాయి. దేవిశ్రీప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బావుంది. పెళ్లి కంటెంట్ ట్విస్ట్ తో పూర్తయ్యే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ పై కొంత అంచనాను క్రియేట్ చేస్తుంది.
సెకండ్ హాఫ్:
ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే.. ఉన్నత చదువుల కోసం కొత్త జంటగా దుబాయ్ లో అడుగు పెట్టిన హీరో హీరోయిన్ తో వెన్నెల కిషోర్ పాత్ర కూడా జాయిన్ అవుతుంది. అడివి శాస్ట్రీగా వెన్నెల కిషోర్ కొంత నవ్వించే ప్రయత్నం చేశాడు. అయితే అసలైన క్లయిమాక్స్ ఎమోషనల్ సీన్స్ మాత్రం అనుకున్న రేంజ్ లో వర్కౌట్ కాలేదు. సినిమాకు సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ కథకు కనెక్ట్ లేవు అనిపిస్తుంది. మ్యారేజ్ లైఫ్ ను అంతగా ఇష్టపడని నితిన్ క్యారెక్టర్ వెంటవెంటనే రంగులు మార్చడం కూడా కాస్త సిల్లీగా అనిపిస్తుంది.
ఫైనల్ గా..
సినిమాలో కామెడీ వర్కౌట్ అయితే ఆడియెన్స్ మిగతా విషయాలని పెద్దగా పట్టించుకోరు. కానీ ఎమోషనల్ సీన్స్ ను మిక్స్ చేసినప్పుడు ఆ రంగు కూడా కలర్ఫుల్ గా కనిపిస్తేనే సంతృప్తిగా ఉంటుంది. ఇక దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ పరంగా పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాడు. కొన్ని చోట్ల మాత్రం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ప్లస్ అయ్యింది. ఇక నితిన్ కామెడీ టైమింగ్ బాగుంది, తన పాత్ర కి న్యాయం చేసాడు. కీర్తి సురేష్ మాత్రం తనలోని అన్ని రంగులను చూపించింది. మిగతా నటీనటులు వారి పాత్రలతో బాగానే మెప్పించారు. ఏదేమైనా సినిమాలో కామెడీని నమ్మి ఒకసారి చూసేయ్యొచ్చు..
ప్లస్ పాయింట్స్:
ఫస్ట్ హాఫ్ కామెడీ సీన్స్
ప్రొడక్షన్ వాల్యూస్
కీర్తి సురేష్ - నితిన్ కాంబో
మైనెస్ పాయింట్స్:
రొటీన్ స్టోరీ
క్లైమాక్స్
బాటమ్ లైన్: రంగ్ దే.. కామెడీ కలర్ బాగానే ఉన్నా.. ఎమోషన కలర్ మిస్సింగ్
రేటింగ్: 3/5
Follow @TBO_Updates
Post a Comment