Review @ Chavu Kaburu Challaga


సినిమా ఏదైనా కూడా లవ్ స్టోరీ మాత్రం కామన్ గానే ఉంటుంది. అయితే ఎంచుకునే బ్యాక్ గ్రౌండ్ కొత్తగా ఉంటుందా లేదా అనేది అసలు పాయింట్. ఇక చావు కబురు చల్లగా సినిమాలో అదే జరిగింది. సినిమా టైటిల్ చెప్పగానే ఎదో కొత్తగా ట్రై చేస్తున్నట్లు అనిపించింది. టీజర్ ట్రైలర్ అలాగే సాంగ్స్ కూడా ఓ మోస్తరుగా బజ్ క్రియేట్ చేశాయి. ఇక సినిమా ఎలా ఉందనే విషయంలోకి వెళితే..

కథ: బస్తీ బలరాజు (కార్తికేయ) మార్చురీ వాన్ డ్రైవర్ గా జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. ఒకరోజు స్మశానవాటికలో భర్త చనిపోయిన హీరోయిన్ మల్లికను (లావణ్య త్రిపాఠి) చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆ పరిస్థితులలో ఆమె మనసును ఎలా గెలుచుకున్నాడు, ఆ తరువాత జరిగిన పరిణామాలు ఏంటి? అనేది అసలు కథ.

విశ్లేషణ:

సినిమా కథ కాస్త కొత్తగానే ఉన్నప్పటికీ మేకింగ్ మాత్రం రొటీన్ గానే ఉంటుంది. హీరోయిన్ భర్త చనిపోతే హీరో ఆమెను ట్రై చేస్తాడు అని ట్రైలర్ లోనే క్లారిటీ ఇచ్చేశారు. ఇక ఫస్ట్ హాఫ్ అయితే చాలా స్లోగానే కొనసాగుతుంది. హీరో అమ్మాయి వెంటపడే సన్నివేశాలు ఎన్నో చూసిన ఆడియెన్స్ కు ఆ సీన్స్ అంత కొత్తగా ఏమి అనిపించదు. ముందు మొండిగా ఉన్నప్పటికీ ఆ తరువాత లవ్ లో పడటం సహజమే. దర్శకుడు కౌశిక్ ఆ విషయంలో ఆశ్చర్యపరిచేంత కొత్త కంటెంట్ ఏమి చూపించలేదు.

ఇక మధ్యమధ్యలో కార్తికేయ కామేడి టైమింగ్ ఆకట్టుకుంటుంది.
 స్టోరీ బ్యాక్ గ్రౌండ్ కొత్తగా ఉన్నా కూడా  మేకింగ్ మాత్రం రొటీన్ అనే చెప్పాలి. ఇందులో ఆమని పాత్ర కొంచెం హైలెట్ అని చెప్పవచ్చు. ఆమె యాక్టింగ్ ఊర మాస్ లో ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే చాలా స్లోగా ఉంది. క్లైమాక్స్ సీన్స్ కొంత వరకు సినిమా స్థాయిని పెంచాయి. ఇక స్క్రీన్ ప్లే తో దర్శకుడు పెద్దగా మెప్పించింది ఏమి లేదు.  కార్తికేయ మాస్ రోల్ తో బాగానే మెప్పించాడు. మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగర్ రోల్స్ కూడా బావున్నాయి. దర్శకుడు ఎంచుకున్న పాత్రలు నిజంగా చాలా కొత్తవి. ఈ రోజుల్లో ఇలాంటి రిస్క్ లు చేస్తేనే జనాలు చూస్తారు అనేది వాస్తవమే. కానీ అలాంటి సెన్సిటివ్ కథలతో ఏ మాత్రం తేడా వచ్చినా ప్లాన్ మొత్తం రివర్స్ అవుతుంది. ఆ విషయంలో దర్శకుడు పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. సినిమాను అయితే ఒకసారి ఎలాంటి అంచనాలు లేకుండా ఒకసారి చూడవచ్చు.


ప్లస్ పాయింట్స్ 
  • బ్యాక్ గ్రౌండ్ కాన్సెప్ట్
  • కార్తికేయ రోల్

మైనెస్ పాయింట్స్
  • రోటీన్ లవ్ ట్రాక్స్
  •  స్క్రీన్ ప్లే
  • సెకండ్ హాఫ్
బాటమ్ లైన్: చావు కబురు.. చెప్పినంత కొత్తగా ఏమి లేదు

Rating: 2.5/5

Post a Comment

Previous Post Next Post