కన్నడ హీరో యష్ కథానాయకుడిగా నటించిన బిగ్ బడ్జెట్ మూవీ కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఆ సినిమా బిజినెస్ కు సంబంధించిన అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక డిజిటల్ రైట్స్ ద్వారా సినిమాకు భారీ స్థాయిలో ప్రాఫిట్స్ అందినట్లు సమాచారం. ఒక విధంగా గత సినిమాల రికార్డులను బ్రేక్ చేసినట్లు టాక్.
KGF చాప్టర్ 1 బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఆ సినిమా డిజిటల్ రైట్స్ ద్వారా పరవాలేదు అనే విధంగా ప్రాఫిట్స్ వచ్చాయి. కానీ ఇటీవల KGF 2 మాత్రం అత్యదిక లాభాన్ని అందుకుంది. సినిమాకు సంబంధించిన శాటిలైట్, ఓటీటీ, మ్యూజిక్.. ఇలా మొత్తం డిజిటల్ వరల్డ్ లో సినిమాకు అన్ని భాషల్లో కలిపి 120కోట్ల వరకు వచ్చాయట. అంటే దాదాపు బడ్జెట్ లో 70% ఇక్కడే రికవరీ ఆయినట్లు చెప్పవచ్చు. గతంలో 2.ఓ కు కూడా 110కోట్ల వరకు వచ్చాయి. ఇక KGF 2 సినిమాను జులై 16న విడుదల చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
Follow @TBO_Updates
Post a Comment