అక్కినేని నాగార్జున చివరగా 2019లో మన్మథుడు 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా దారుణమైన రిజల్ట్ ను అందుకోవడంతో నెక్స్ట్ ఎలాగైనా మంచి సినిమాతో హిట్ కొట్టాలని రెడీ అయ్యాడు. పూర్తిగా ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన వైల్డ్ డాగ్ సినిమా ఏప్రిల్ 2న థియేటర్స్ లోకి రానున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు.
మొదట ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని అనుకున్న విషయం తెలిసిందే. నెట్ ఫ్లిక్స్ నుంచి 20కోట్లకు పైగా ఆఫర్ రావడంతో ఒప్పేసుకున్నారు కూడా. అయితే రీసెంట్ గా క్రాక్, ఉప్పెన సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్టవ్వడంతో తప్పకుండా వైల్డ్ డాగ్ కూడా హిట్ అవుతుందని ఆ డీల్ ను క్యాన్సిల్ చేశారు. మొదట జనాలు థియేటర్స్ వరకు రారేమో అనే భయంతోనే ఓటీటీ వైపు వెళ్లినట్లు నాగ్ ప్రెస్ మీట్ లో చెప్పారు. ఇక ఇటీవల బాక్సాఫీస్ హిట్స్ వలన సినిమాలో మ్యాటర్ ఉంటే జనాలు తప్పకుండా సినిమా కోసం థియేటర్స్ వరకు వస్తారని అందుకే థియేటర్స్ లో విడుదల చేయాలని ఆనుకుంటున్నట్లు వివరణ ఇచ్చారు.
Follow @TBO_Updates
Post a Comment