సినిమాకు బజ్ పెరగాలి అంటే ఈ రోజుల్లో ఒక్క సాంగ్ వర్కౌట్ అయితే చాలు. ఇక అందులో సిద్ శ్రీరామ్, అనురాగ్ కులకర్ణి లాంటి ట్రేండింగ్ సింగర్స్ తో పాడిస్తే రీచ్ అయ్యే స్పీడ్ మరో రెంజ్ లో ఉంటుంది. ఇక దానికి తోడు ఇప్పుడు ప్రమోషన్ కూడా క్లిక్కయితే సినిమా ఓపెనింగ్స్ పై టెన్షన్ అవసరం లేదు. ఇక జాతిరత్నాలు స్టైల్ లోనే ఇప్పుడు రంగ్ దే టీమ్ కూడా అదే ఫాలో అవుతోంది.
ఓ విధంగా చెప్పాలి అంటే ఇది 'రంగ్ దే' రత్నం. ఎందుకంటే నితిన్ గ్యాంగ్ కూడా ఏ మాత్రం మొహమాటం లేకుండా ఒకరిపై ఒకరు పర్సనల్ గా కామెంట్స్ చేసేసుకుంటున్నారు. జాతిరత్నాలు టీమ్ ముందు నుంచి అలానే చేస్తూ వచ్చింది. నవీన్ పొలిశెట్టి, ప్రియ దర్శి, దర్శకుడు అనుదీప్ ఏ మాత్రం గ్యాప్ లేకుండా పంచ్ లతో పర్సనల్ విషయాలను కూడా కామెడీ చేస్తూ జనాల్లోకి వెళ్లిపోయారు. ఇక మొన్నటి నుంచి రంగ్ దే టీమ్ కూడా అదే ఫాలో అవుతోంది. అభినవ్ సుహాస్ నితిన్ కామెడీ స్కిట్ తో పాటు నిన్న వచ్చిన వెన్నెల కిషోర్ బ్రహ్మాజీ స్కిట్ వరకు కూడా మొహమాటం లేకుండా వారిపై వారే పంచ్ లు వేసుకుంటున్నారు.
నితిన్ అయితే ఈవెంట్స్ లలో మాటల డోస్ గట్టిగానే పెంచాడు. ఈ లెవెల్లో ప్రమోట్ చేయడానికి మరొక ముఖ్యమైన కారణం కూడా ఉంది. బడ్జెట్ కూడా గట్టిగానే పెట్టారు. దాదాపు 25 కోట్ల వరకు బిజినెస్ చేస్తేనే హిట్టయినట్లు. అసలే చెక్ దెబ్బకు మళ్ళీ డిజాస్టర్ ట్రాక్ లో పడ్డ నితిన్ ఎలాగైనా రంగ్ దే సినిమాతో హిట్టు కొట్టాలని ఇలా ఫాలో అవుతున్నారు. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూద్దాం.
Follow @TBO_Updates

Post a Comment