అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న బిగ్ బడ్జెట్ మూవీ పుష్ప థియేటర్స్ లోకి రావడానిగా సమయం చాలానే ఉన్నా సినిమా ట్యాగ్స్ సోషల్ మీడియాలో ఇంకా ట్రెండ్ అవుతున్నాయి. క్రియేటివ్ గా ఆలోచించే సుకుమార్ మొదటిసారి అత్యదిక బడ్జెట్ తో సినిమాను రూపొందిస్తున్న తెలుస్తోంది.
ఇక సినిమాను ఆగస్టు 13న విడుదల చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమాకి సంబంధించిన టీజర్ ను రెడీ చేస్తున్నారు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ ను అన్ని భాషల్లో విడుదల చేయనున్నారు. గత వారం నుంచి దర్శకుడు సుకుమార్ అదే పని మీద బిజీగా ఉన్నట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు సినిమా షూటింగ్ ఇంకా సగం కూడా పూర్తవ్వలేదు. పూర్తి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మరి దర్శకుడు సినిమా ఎంత త్వరగా పూర్తి చేస్తాడో చూడాలి. అలాగే త్వరలో ఒక పాటను కూడా రిలీజ్ చేయవచ్చని సమాచారం.
Follow @TBO_Updates
Post a Comment