టాలీవుడ్ లో రేపు సోషల్ మీడియాలో సరికొత్త రికార్థులు దర్శనమివ్వబోతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 27 వ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా యూ ట్యూబ్ లో విడుదలైతే ఫ్యాన్స్ చేసే మొదటి పని భారీ స్థాయిలో వైరల్ అయ్యేలా చేయడం. ప్రస్తుతం 24 గంటల్లో అత్యదిక లైక్స్ అందుకున్న వాటిలో ప్రభాస్ రాధే శ్యామ్ గ్లింప్స్ 395K లైక్స్ తో మొదటి స్థానంలో ఉంది.
రెండవ స్థానంలో సైరా 287K లైక్స్. స్పైడర్ 190K లైక్స్ తో మూడవ స్థానంలో ఉంది. ఇక ఇప్పుడు 24గంటల్లో పవర్ స్టార్ 27వ సినిమా హరిహర వీరమల్లు ఏ స్థాయిలో లైక్స్ అందుకుంటుందో చూడాలి. గురువారం సాయంత్రం 5గంటల 19నిమిషాలకు ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సూర్య మూవీస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా ఎమ్ఎమ్.కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు.
Follow @TBO_Updates
Post a Comment