KGF 1 సినిమాతో బాక్సాఫీస్ హిట్ కొట్టిన దర్శకుడు ప్రశాంత్ నీల్ నెక్స్ట్ చాప్టర్ 2తో కూడా అంతకంటే ఎక్కువ రేంజ్ లో రికార్డులను తిరగరాసేలా ఉన్నాడు. ఆ సినిమా ఈజీగా 500కోట్ల బిజినెస్ చేసేలా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రభాస్ తో సలార్ సినిమాను సెట్స్ పైకి తెచ్చిన ప్రశాంత్ ఆ ప్రాజెక్ట్ అనంతరం జూనియర్ ఎన్టీఆర్ తో మరో సినిమాను సెట్ చేసుకున్న విషయం తెలిసిందే.
ఎన్టీఆర్ సినిమా కోసం ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ ఆ దర్శకుడికి అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు RRR నిర్మాత డివివి.దానయ్య కూడా సాలీడ్ అడ్వాన్స్ ఇచ్చినట్లు టాక్ అయితే వస్తోంది. బన్నీతో ఒక సినిమా చేయాలని ఆలోచిస్తున్న ప్రశాంత్ ఆ సినిమా దానయ్యతో చేసే అవకాశం లేదు. ఎందుకంటే అల్లు అరవింద్ ప్రశాంత్ నీల్ తో ప్రొడ్యూస్ చేయాలని అనుకుంటున్నాడు. అంటే దానయ్య మరో అగ్ర హీరోను ప్రశాంత్ నీల్ తో కలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ హీరో ఎవరో తెలియాలి అంటే మరికొన్నాళ్లు వేయిట్ చేయాల్సిందే.
Follow @TBO_Updates
Post a Comment