మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా వ్యవహరించిన మొదటి సినిమా జాతి రాత్నాలు ఈ నెల 11న విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమాపై బజ్ బాగానే పెరుగుతోంది. పిట్టగొడ దర్శకుడు అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో టాలెంటెడ్ యాక్టర్స్ నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించారు.
ఇక సినిమాకు సంబంధించిన చిట్టి సాంగ్ ఇప్పటికే సోషల్ మీడియాను ఉపేసింది. టీజర్ కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమాను విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయిన సమయంలో చిత్ర యూనిట్ ప్రభాస్ ద్వారా మరింత హైప్ క్రియేట్ చేయడానికి సిద్ధమైంది. ప్రభాస్ చేతుల మీదుగా జాతిరత్నాలు సినిమా ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు. అందుకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాగ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే.
Follow @TBO_Updates
Post a Comment