రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బాలీవుడ్ హీరోల కంటే హై రేంజ్ లో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా అనే పదానికి అసలైన అర్దాన్ని చెప్పిన ప్రభాస్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో సరికొత్త సర్ ప్రైజ్ లు ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. బాలీవుడ్ నుంచి కూడా ప్రభాస్ కు ఆఫర్స్ చాలానే వస్తున్నాయట.
ఆదిపురుష్ సినిమా పూర్తిగా బాలీవుడ్ టెక్నీషియన్స్ తోనే రూపొందుతోంది. అయితే ఆ సినిమా కోసం తరచు ముంబై వెళుతున్న ప్రభాస్ హోటల్స్ లో ఉండడానికి ఇష్టపడటం లేదట. అందుకే ఒక కొత్త ఇల్లు కొనాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో మరిన్ని బాలీవుడ్ సినిమాలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ముంబైలో తనకు ఇష్టమైన విధంగా ఒక ఇంటిని ప్లాన్ చేసుకుంటున్నాడట. అందుకు 100కోట్లకు పైగానే ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.
Follow @TBO_Updates
Post a Comment