తమిళనాడు అనగానే అందరికి గుర్తొచ్చేది ఎలక్షన్స్. సినిమాల హడావుడి ఎంత ఉన్నా కూడా అక్కడ పాలిటిక్స్ మొదలైతే జనాల ఫోకస్ మరొక దానిపై ఉండదు. ఇక ఏప్రిల్ 6న తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నందువల్ల రాబోయే సినిమాలపై. ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 2న కార్తీ సుల్తాన్ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.
యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా తెలుగులో కూడా భారీగానే రిలీజ్ అవుతోంది. అయితే రిలీజ్ కు అంతా సిద్ధం చేసుకున్న సమయంలో సుల్తాన్ వాయిదా పడే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది. తమిళనాడులో ఎలక్షన్స్ ఉన్నందువల్ల సినిమను మరొక డేట్ కు రిలీజ్ చేయనున్నారట. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన బజ్ అయితే గట్టిగానే ఉంది. రిలీజైన టీజర్ సాంగ్స్ కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మరి సినిమా న్యూ రిలీజ్ డేట్ పై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment