పవన్ కళ్యాణ్ ఇంతవరకు తన కెరీర్ లో ఎప్పుడు చేయని విధంగా మొదటిసారి ఒక పిరియాడిక్ ఫిల్మ్ చేస్తున్న విషయం తెలిసిందే. బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న హరిహర వీరమల్లు సినిమాపై హోప్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో బజ్ చూస్తుంటేనే అర్ధమవుతోంది. ఇక వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ సరికొత్తగా కనిపించనున్నట్లు ఇటీవల వచ్చిన ఫస్ట్ లుక్ టీజర్ తోనే అర్ధమయ్యింది.
అయితే లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ సినిమాలో విభిన్నమైన షేడ్స్ చూపిస్తాడట. దాదాపు 30కి పైగా డిఫరెంట్ వింటేజ్ కాస్ట్యూమ్ తో కనిపిస్తారని తెలుస్తోంది. అంతే కాకుండా మూడు విభిన్నమైన గెటప్పుల్లో కనిపిస్తారని, ఫస్ట్ హాఫ్ లో అలాగే సేకండాఫ్ లో మాత్రం తన లుక్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయని తెలుస్తోంది. దర్శకుడు క్రిష్ ఈ సినిమాను పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సినిమా కోసం దాదాపు 150కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు టాక్.
Follow @TBO_Updates
Post a Comment