జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి RRR అనంతరం తన 30వ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే. కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక హాసిని కాంబినేషన్ లో రూపొందనున్న ఈ సినిమా ను ఎనౌన్స్ చేసి ఏడాది అయినా ఇంకా షూటింగ్ పనులు మొదలవ్వలేదు. ఇక ఫైనల్ గా RRR షూటింగ్ తుది దశకు చేరుకోవడంతో తారక్ 30వ సినిమాకు లాంచ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం.
సినిమా అఫీషియల్ గా ఏప్రిల్ 13న పూజా కార్యక్రమాలతో లాంచ్ కానున్నట్లు సమాచారం. ఇక సినిమా షూటింగ్ ను ఈ ఏడాది డిసెంబర్ లోపు ఫినిష్ చేయాలని ఎన్టీఆర్ టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం. సినిమాను మొదట సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అప్పుడు మహేష్, పవన్ నుంచి పోటీ ఎక్కువగా ఉండడం వలన సినిమాను సమ్మర్ కు షిఫ్ట్ చేసినట్లు సమాచారం. అనుకున్నట్లు పనులు పూర్తయితే 2022 ఏప్రిల్ 19న సినిమా రిలీజ్ కావచ్చని టాక్ వస్తోంది.
Follow @TBO_Updates
Post a Comment