జూనియర్ ఎన్టీఆర్ స్పోర్క్స్ కార్లంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మార్కెట్ లోకి స్టైలిష్ కార్లు వస్తే ముందుగా కొనడానికి ప్రయత్నం చేసే హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఇక చాలా రోజుల తరువాత ఎన్టీఆర్ మరో ఖరీదైన కారునుకొనుగోలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్డర్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇటలీ నుంచి దిగుమతి కాబోతున్న ఆ కారు లంబోర్ఘిని ఉరుస్ మోడల్. దీని విలువ ఇండియన్ కరెన్సీలో 5కోట్లకు పైగా ఉంటుందట. ఇటీవల ఎన్టీఆర్ బుక్ చేసారని సమాచారం. అసలైతే గత ఏడాదిలోనే ఖరీదైన కారును కొనుగోలు చేయాలని అనుకున్న జూనియర్ ఎన్టీఆర్ కొన్ని కారణాల వల్ల వెయిట్ చేయాల్సి వచ్చిందట. గత రెండేళ్లుగా కారును మార్చని యంగ్ టైగర్ త్వరలోనే ఈ న్యూ మోడల్ స్పోర్ట్స్ కారుతో హైదరాబాద్ లో చక్కర్లు కొట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం తారక్ రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
Follow @TBO_Updates
Post a Comment