వెంకటేష్ నుంచి రాబోతున్న డిఫరెంట్ యాక్షన్ డ్రామా నారప్ప రిలీజ్ పై మరోసారి కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతోంది. ఫిబ్రవరిలోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను చాలా కాలంగా వాయిదా వేసుకుంటూ వస్తున్నారు నిర్మాత సురేష్ బాబు. సినిమా షూటింగ్ అయితే ఎప్పుడో పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఆల్ మోస్ట్ ఫినిష్ అయ్యాయి.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మే 14న విడుదల చేయనున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే అదే సమయానికి ఆచార్య రాబోతుంది. దీంతో మళ్ళీ ప్లాన్ చేంజ్ చేసినట్లు సమాచారం. సినిమాను ఏప్రిల్ 30న లేదా మే 28న విడుదల చేయాలని కొత్త ప్లాన్ వేసినట్లు టాక్. కోలీవుడ్ మూవీ అసురన్ మూవీకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియమణి, ప్రకాష్ రాజ్ వంటి స్టార్స్ నటించారు.
Follow @TBO_Updates
Post a Comment