New Release date for Gopichand 'SeetiMaarr'!!

యాక్షన్ హీరో గోపిచంద్ హిట్టు చూసి చాలా కాలమయ్యింది. ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద పవర్ఫుల్ హిట్టు కొట్టాలని విభిన్నమైన కథలతో వస్తున్నాడు. కానీ ఏ సినిమా కూడా అతనికి కలిసి రావడం లేదు. కమర్షియల్ గా కూడా పెట్టిన పెట్టుబడికి లాభాలు రావడం లేదు. ఇక అతని ఆశలన్నీ సీటీమార్ పైనే పెట్టుకున్నాడు.

సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 2న రిలీజ్ చేయాలని అంతా సిద్ధం చేసుకున్న సమయంలో అనుకోని పరిస్థితుల్లో వాయిదా వేయాల్సి వచ్చింది. ఇక ఫైనల్ గా ఒక కొత్త డేట్ ను ఫిక్స్ చేసుకున్నట్లు టాక్ వస్తోంది. ఏప్రిల్ 30న రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అయితే అదే రోజు రానా విరాటపర్వం కూడా విడుదల కాబోతోంది. ఈ సినిమాపై కూడా ఓ వర్గం ఆడియేన్స్ అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి రెండు సినిమాల్లో బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా క్లిక్కవుతుందో చూడాలి.



Post a Comment

Previous Post Next Post