టాలీవుడ్ లో చాలా రోజుల తరువాత కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న చిత్రం జాతిరత్నాలు. పెద్దగా స్టార్ క్యాస్ట్ లేకపోయినా కూడా మొదటి నుంచి ప్రమోషన్స్ తో జనాలను అమితంగా ఆకట్టుకున్న చిత్ర యూనిట్ కు కష్టానికి తగ్గట్లుగా ఫలితం దక్కింది. సినిమాకు మొదటి మూడు రోజుల్లోనే పెట్టిన పెట్టుబడికి లాభాలు వచ్చాయి.
ఇక సినిమా హీరో నవీన్ పొలిశెట్టికి మరిన్ని ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఒకరిద్దరు నిర్మాతల నుంచి పిలుపు వచ్చినట్లు టాక్. ఇక దిల్ రాజు నుంచి కూడా నవీన్ ఫోన్ కాల్ వెళ్లినట్లు తెలుస్తోంది. యువ దర్శకులతో రెండు లవ్ స్టోరీలు రెడీ చేయించిన దిల్ రాజు సరైన యంగ్ హీరో కోసం వెతుకుతున్న సమయంలో నవీన్ హిట్ కొట్టడంతో బాగా ఎట్రాక్ట్ ఎయినట్లు సమాచారం. సినిమా ప్రమోషన్ విషయంలో అతను పడిన కస్థానికి కూడా దిల్ రాజు ఫిదా అయినట్లు తెలుస్తోంది. ఈ కాంబినేషన్ పై అఫీషియల్ క్లారిటీ రానున్నట్లు సమాచారం.
Follow @TBO_Updates
Post a Comment