నాని లైనప్ లో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ సినిమాలున్నాయి. మొదట టక్ జగదీష్ తో రాబోతున్న విషయం తెలిసిందే. అయితే అందరి ఫోకస్ మాత్రం శ్యామ్ సింగరాయ్ పైనే ఉంది. ఆ సినిమా కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ స్టైల్ లో ఉంటుందట. పిరియాడిక్ స్టోరీ అని ముందే పోస్టర్ ద్వారా చెప్పేశారు. పైగా నాని కోర మీసాలతో కనిపిస్తూ చాలా కొత్త లుక్కుతో ఆకట్టుకుంటున్నాడు.
అయితే ఈ హీరో త్వరలోనే మరో కొత్త సినిమాకు ఒకే చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో మరొక కథపై చర్చలు జరిపినట్లు సమాచారం. జెర్సీ సినిమా ఇటీవల నేషనల్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా ఆ సినిమా రీమేక్ అవుతోంది. అయితే దర్శకుడు గౌతమ్ మరొక ఇంట్రెస్టింగ్ ఎమోషనల్ కథను నాని కోసమే రాసినట్లు టాక్ వస్తోంది. నాని కూడా గౌతమ్ తో చేయడానికి ఎప్పుడైనా రెడీ అంటున్నాడట. ఈ కొత్త ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఒక టార్గెట్ అయితే సెట్ చేసుకుంటున్నట్లు సమాచారం.
Follow @TBO_Updates
Post a Comment