యువ హీరో నాగ చైతన్య మజిలీ సినిమాతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత వెంకీమామ ఆ స్థాయిలో వసూళ్లు అందుకోకపోయినప్పటికి రాబోయే సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం కాయం. ముందుగా లవ్ స్టొరీ సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత మరో ఆరు సినిమాలను లైన్ లో పెట్టాడు.
మనం డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ సినిమాతో పాటు అమీర్ ఖాన్ న్యూ ప్రాజెక్ట్ లాల్ సింగ్ చద్దాలో విజయ్ సేతుపతి చేయాల్సిన పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం . మోహన్ కృష్ణ ఇంద్రగంటి ప్రాజెక్ట్. అలాగే తరుణ్ భాస్కర్ తో ఒక సినిమా. మైత్రి మూవీ మేకర్స్ లో పరశురామ్ తో ఒక సినిమా అనుకున్న విషయం తెలిసిందే. అలాగే రంగ్ దే దర్శకుడు వెంకీ అట్లూరితో కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇక ఒక్కో సినిమాకు 8 నుంచి 10కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్న నాగ చైతన్య ఈ ఆరు సినిమాలకు మొత్తంగా 50కోట్లకు పైగా ఆదాయాన్ని అందుకుంటున్నట్లు సమాచారం.
Follow @TBO_Updates
Post a Comment