అర్జున్ రెడ్డి సినిమాతో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన సందీప్ రెడ్డి ప్రస్తుతం బాలీవుడ్ లో బిగ్ బడ్జెట్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఎనిమల్ అనే ఆ సినిమాలో రన్ బీర్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. అయితే గతంలో సందీప్, మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్లు అనేక రకాల కథనాలు వచ్చాయి. నిజానికి ఈ దర్శకుడు రెండు కథలను వినిపించాడు.
ఎనిమల్ కథ కూడా ముందు మహేష్ బాబుకు చెప్పిందే. కానీ తన ఇమేజ్ కు అలాంటి కథలు సెట్టవ్వవని మహేష్ సున్నితంగా రిజెక్ట్ చేశాడు. ఇక భవిష్యత్తులో వీరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందో లేదో తెలియదు గాని ఇప్పుడైతే సందీప్, మహేష్ బాబును డైరెక్ట్ చేయడానికి సిద్ధమయ్యాడు. అది సినిమా కాదు. ఒక యాడ్ అని తెలుస్తోంది. ఒక బడా కంపెనీకి సంబంధించిన యాడ్ లో నటించడానికి ఒప్పుకున్న సూపర్ స్టార్ దర్శకుడు చెప్పిన కాన్సెప్ట్ కూడా బావుందని సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే చెప్పినట్లు సమాచారం.
Follow @TBO_Updates
Post a Comment