టాలీవుడ్ ఇండస్ట్రీలో జాతిరత్నం సినిమా హాట్ టాపిక్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ ఒక్క సినిమాతో హీరో నవీన్ పోలిశెట్టి రేంజ్ మారిపోయింది. బాక్సాఫీస్ వద్ద సినిమా 50కోట్ల వరకు మార్కెట్ చేయడంలో కీలక పాత్ర పోషించిన నవీన్ కు ఆఫర్స్ కూడా గట్టిగానే వస్తున్నాయి. ఇప్పటికే అనుష్క సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.
ఇక దిల్ రాజు నుంచి కూడా కాల్ వచ్చినట్లు టాక్ వస్తోంది. అంతే కాకుండా మహేష్ బాబు ఆఫీస్ నుంచి కూడా పిలుపు అందినట్లు సమాచారం. మహేష్ బాబు తన GMB ప్రొడక్షన్ లో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని ట్రై చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడిపుడే ఎదుగుతున్న నవీన్ పోలిశెట్టి తో కూడా మంచి సినిమా చేయాలనీ అనుకుంటున్నాడట. అయితే అఫీషియల్ గా ప్రాజెక్ట్ సెట్టయ్యే వరకు ఈ విషయంపై ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వాలని అనుకోవడం లేదట నవీన్ పోలిశెట్టి. ప్రస్తుతం మహేష్ ప్రొడక్షన్ లో అడివి శేష్ మేజర్ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.
Follow @TBO_Updates
Post a Comment