బాహుబలి అనంతరం సౌత్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ KGF చాప్టర్ 1. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా మంచి వసూళ్లను అందుకోవడమే కాకుండా చాప్టర్ 2పై కూడా అంచనాలు గట్టిగానే పెంచేసింది. నిజానికి KGF 2 బిజినెస్ వందల కోట్లు పెరగడానికి కారణం లేకపోలేదు. సినిమా టీజరే భారీ స్థాయిలో డిమాండ్ పెంచింది.
ఇప్పటివరకు యూ ట్యూబ్ లో విడుదలైన టీజర్స్ లలో అత్యధిక వ్యూవ్స్ అందుకున్న టీజర్ గా 175 మిలియన్ల వ్యూవ్స్ తో అగ్ర స్థానంలో నిలిచింది. అంతే కాకుండా అత్యధిక లైకులు అందుకున్న టీజర్ గా కూడా 8 మిలియన్ల తో KGF 2 టీజర్ నెంబర్ వన్ గా నిలిచింది. ఈ ఒక్క రికార్డుతో సినిమా మార్కెట్ ఎలా ఉందో అర్థం చెసుకోవచ్చు. ఓపెనింగ్స్ తోనే సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేయవచ్చని సమాచారం. ఇక సినిమాను వరల్డ్ వైడ్ గా తెలుగు తమిళ్ హిందీ కన్నడ మలయాళ భాషల్లో జూలై 16న విడుదల చేయబోతున్నారు.
Follow @TBO_Updates
Post a Comment