సౌత్ ఇండస్ట్రీలో మరో బిగ్ కాంబినేషన్ లో కొత్త పాన్ ఇండియా సినిమా రాబోతోందా అనే ఊహాగానాలు ఒక్కసారిగా వైరల్ అవుతున్నాయి. KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ సడన్ గా స్టైలిష్ స్టార్ ను కలవడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం బన్నీ పుష్ప సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక మరోవైపు ప్రశాంత్ నీల్ తో కూడా బన్నీ చర్చలు మొదలు పెట్టినట్లు సమాచారం.
అసలు మ్యాటర్ లోకి వస్తే రీసెంట్ గా గీత ఆర్ట్స్ ఆఫీస్ వద్ద ప్రశాంత్ నీల్ దర్శనమిచ్చాడు. అల్లు అర్జున్ ను ప్రత్యేకంగా కలుసుకొని రెండు గంటల పాటు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. చూస్తుంటే భవిష్యత్తులో మరో బిగ్ పాన్ ఇండియా సినిమా రావచ్చని టాక్ మొదలైంది. ప్రశాంత్.. KGF 2 రిలీజ్ కు రెడీ అవుతుండగా, సలార్ షూటింగ్ దశలో ఉంది. ఈ రెండు ప్రేక్షకుల ముందుకు రాకముందే మరో హీరోను లైన్ లో పెట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
Follow @TBO_Updates
Post a Comment