టాలీవుడ్ ఇండస్ట్రీలో పూర్వ వైభవం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఒక విధంగా గతంలో కంటే ఇప్పుడు కంటెంట్ బేసిడ్ సినిమాలకు ఆదరణ కూడా పెరిగిందని చెప్పవచ్చు. ఫిబ్రవరి నెలలో ఉప్పెన, నాంది, చెక్ వంటి సినిమాలు రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక మార్చ్ లో కూడా మరిన్ని డిఫరెంట్ సినిమాలు రాబోతున్నాయి.
మార్చ్ 5న సందీప్ కిషన్ - A1 ఎక్స్ ప్రెస్, రాజ్ తరుణ్ - పవర్ ప్లే, మొగలి రేకులు సాగర్ - షాది ముబారక్ వంటి సినిమాలు పోటీకి సిద్ధమయ్యాయి. మార్చ్ 11న జాతి రత్నాలు, గాలి సంపత్, ఇక మార్చ్ 19న ఆది సాయి కుమార్ - శశి, కార్తికేయ - చావు కబురు చల్లగా, మంచు విష్ణు - మోసగాళ్ళు రాబోతున్నాయి. ఇక చివరి వారంలో అంటే మార్చ్ 26న నితిన్ నుంచి మరో సినిమా రంగ్ దే రాబోతోంది. రానా - అరణ్య కూడా అదే రోజు విడుదల అవుతుండగా మార్చ్ 27న కీరవాణి తనయుడు శ్రీ సింహా - తెల్లవారితే గురువారం రాబోతోంది. మరి ఈ సినిమాల్లో ఏ సినిమా పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలను అందిస్తుందో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment