పూజా హెగ్డే లక్కేమిటో గాని అసలు గ్యాప్ లేకుండా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేస్తోంది. దువ్వాడ జగన్నాథమ్ సినిమా ముందు వరకు కూడా ఆమెకు ఛాన్సులు ఎక్కువగా రాలేవు. చేసిన చిన్న సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. ఇక డీజే లో బికినీ వేయడంతో అమ్మడి రేంజ్ అమాంతంగా పెరిగిపోయింది. ఇక ఆ తరువాత అరవింద సమేత, మహర్షి, అల.. వైకుంఠపురములో సినిమాలు మరో రేంజ్ కు తీసుకెళ్ళాయి.
ఇక బ్యూటీ చేతుల్లో ప్రస్తుతం బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సినిమా, మరోవైపు ప్రభాస్ తో పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. రాధేశ్యామ్ హిట్టయితే ఆమె క్రేజ్ మరో రేంజ్ కు వెళ్లినట్లే. ఇక ఇప్పుడు కోలీవుడ్ లో దళపతి విజయ్ 65వ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇప్పటికే 2.50కోట్ల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు టాక్ వస్తోంది. ఇక చేతిలో ఉన్న సినిమాలు హిట్టయితే ఆ సంఖ్య డబుల్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలాగే ఆమెకు అడిగినంత ఇవ్వడానికి కూడా రెడీగా ఉంటారని చెప్పవచ్చు. మరి బుట్టబొమ్మ ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment