చెక్ సినిమాతో హిట్ కొట్టాలని అనుకున్న నితిన్ కు బాక్సాఫీస్ వద్ద దారుణమైన దెబ్బ పడింది. సినిమా ఏ మాత్రం క్లిక్కవ్వలేదు. అయితే ఆ సినిమా ప్లాప్ కావడానికి మరొక రీజన్ కూడా ఉంది. టికెట్ రేట్లు అమితంగా పెంచేయడం వలన మిడిల్ క్లాస్ ఆడియెన్స్ ఆ సినిమా వైపు చూడలేదు. 150 రూపాయలు ఎక్కువని అనుకుంటున్న సమయంలో 200వరకు పెంచారు.
శ్రీకారం సినిమాకు కూడా టికెట్ రేట్స్ పెంచడం వలన ఎఫెక్ట్ గట్టిగానే పడింది. ఇక ఇప్పుడు నితిన్ సినిమాకు మరోసారి అదే రిస్క్ చేస్తున్నారట. రంగ్ దే సినిమా మార్చి 26న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా టికెట్ రేట్లను కూడా పెంచడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. అందుకు కారణం సినిమాపై భారీగా పెట్టుబడి పెట్టడమే. వీలైనంత తొందరగా రికవరీ చేయాలని ప్లాన్ చేశారు. మరి ఆ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment