టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగెస్ట్ ప్రొడక్షన్ హౌజ్ గా ముందుకు సాగుతున్న సంస్థ మైత్రి మూవీ మేకర్స్. ఈ బ్యానర్ లో స్టార్ హీరోలు స్టార్ దర్శకులు చాలా బిజీ కాబోతున్నారు. ఇక క్రాక్ సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న దర్శకుడు గోపిచంద్ మలినేని నెక్స్ట్ ఈ సంస్థలో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.
దాదాపు స్క్రిప్ట్ అయితే రెడీ అయినట్లు తెలుస్తోంది. మరోసారి బాలకృష్ణతో చర్చలు జరపడానికి రెడీ అవుతున్నారు. అయితే దర్శకుడు గోపిచంద్ బాలయ్యతో హిట్టు కొడితే మరో బంపర్ ఆఫర్ కొట్టేసినట్లే. బాలయ్య సినిమా సక్సెస్ అయితే ఆ తరువాత మహేష్ బాబుతో సినిమా చేసే ఛాన్స్ ఇప్పిస్తామని మైత్రి మూవీ మేకర్స్ ఓ కండిషన్ పెట్టారట. దీంతో దర్శకుడు బాలయ్య సినిమా కోసం అమితంగా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాటతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
Follow @TBO_Updates
Post a Comment