దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వచ్చిన విక్టరీ వెంకటేష్ హీరోగా తనకంటూ ఒక గుర్తింపును అందుకోగా రానా దగ్గుబాటి కూడా మరింత డిఫరెంట్ యాక్టర్ గా క్రేజ్ అందుకున్నాడు. బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా ఎన్నో ప్రయోగాలతో కష్టపడి పైకొచ్చారు ఈ హీరోలు. ఇక నెక్స్ట్ ఈ ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్నాడు. అతను మరెవరో కాదు సురేష్ బాబు చిన్న కుమారుడు అభిరామ్.
అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నట్లు గత మూడేళ్ళ నుంచి అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. కానీ సురేష్ బాబు ఎందుకో కొడుకు ఎంట్రీని హోల్డ్ లో పెడుతూ వస్తున్నారు. ఇక ఫైనల్ గా ఒక ప్రాజెక్ట్ సెట్టయినట్లు తెలుస్తోంది. సీనియర్ డైరెక్టర్ రవిబాబు రాసిన ఒక డిఫరెంట్ థ్రిల్లర్ కథకు కొడుకు ఎంట్రీకి సెట్టవుతుందని సురేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ వస్తోంది. అయితే ఈ మధ్య కాలంలో రవిబాబు డైరెక్ట్ చేస్తున్న సినిమాలకు పెద్దగా రెస్పాన్స్ రావడం లేదు. మరి సురేష్ బాబు ఎలాంటి నమ్మకంతో ఒప్పుకున్నారో తెలియాలి అంటే మరికొన్నాళ్లు వేయిట్ చేయాల్సిందే.
Follow @TBO_Updates
Post a Comment