మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే బాబీతో ఒక సినిమాను స్టార్ట్ చేయబోతున్నారు. జైలవకుశతో కమర్షియల్ హిట్టు కొట్టిన బాబీ ఆ సినిమా అనంతరం చేసిన వెంకీ మామా అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ కాలేదు. అయినప్పటికీ మెగాస్టార్ అతన్ని నమ్మి అవకాశం ఇచ్చారు. ఇక కమర్షియల్ ఏలేమెంట్స్ తో పవర్ఫుల్ కథను రేడి చేస్తున్న బాబీ ఫుల్ స్క్రిప్ట్ ను ఆల్ మోస్ట్ ఫినిష్ చేసినట్లు సమాచారం.
ఇక ఆ సినిమాకు టైటిల్ కూడా సిద్ధమైనట్లు సమాచారం. మెగాస్టార్ కథలో హీరో పాత్ర పేరు వీరయ్య కావాడంతో అదే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ ఈ సినిమాలో కోర మీసాలతో హై వోల్టేజ్ లుక్కుతో దర్శనమివ్వనున్నారట. ఇక దర్శకుడు బాబీ ఇందులో ఇద్దరు అగ్ర హీరోయిన్స్ ను అనుకుంటున్నట్లు సమాచారం. మాస్ ఆడియెన్స్ కు అలగే ఫ్యామిలీ ఆడియెన్స్ కు నచ్చే విధంగా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు సమాచారం.
Follow @TBO_Updates
Post a Comment