సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాటతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అలాగే హెవెల్స్ కంపెనీకి చెందిన యాడ్ షూట్ కూడా చేస్తున్నాడు. తమన్నా, మహేష్ బాబు కలిసి చేస్తున్న ఆ యాడ్ ను సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఇటీవల మహేష్ ఒక బాలీవుడ్ దర్శకనిర్మాతతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
ధర్మ ప్రొడక్షన్ లో ఎన్నో బాక్సాఫీస్ హిట్స్ అందుకున్న కరణ్ జోహార్ మహేష్ బాబుతో రీసెంట్ గా ఒక ప్రాజెక్ట్ గురించి మాట్లాడినట్లు టాక్. కథ నచ్చడంతో మహేష్ కూడా కాస్త పాజిటివ్ గా స్పందించినట్లు సమాచారం. పూర్తిగా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదట. మహేష్ నెక్స్ట్ రాజమౌళితో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. దానికంటే ముందు ఒక చిన్న సినిమా చేయాలని కూడా అనుకుంటున్నాడు. ఇక కరణ్ జోహార్ తో ఒప్పుకుంటే గనక రాజమౌళి సినిమా తరువాతే ఉండవచ్చని సమాచారం.
Follow @TBO_Updates
Post a Comment