టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ కొరత గట్టిగానే ఉంది. అలాగే తమిళ్ లో కూడా ఈ మధ్య కాలంలో కొత్త బ్యూటీలు ఎవరు కూడా అనుకున్నంత రేంజ్ లో రాణించడం లేదు. తెలుగులో అయితే గత రెండు మూడేళ్ళ నుంచి పూజ హెగ్డే డామినేషన్ కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. ఇక వరుస విజయాలు అందడంతో అమ్మడు రెమ్యునరేషన్ డోస్ కూడా పెంచేసింది.
ఇప్పటికే రెండు కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు అనేక రకాల కథనాలు వైరల్ అవుతున్నాయి. అయితే కోలీవుడ్ లో మరో పాన్ ఇండియా ఆఫర్ రాగానే బుట్టబొమ్మ మళ్ళీ డోస్ పెంచినట్లు టాక్ వస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ తో విజయ్ 65వ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా కోసం పూజా హెగ్డే హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు ఒక టాక్ అయితే వస్తోంది. ఇక ఆమెకు 3.50కోట్ల వరకు రెమ్యునరేషన్ కూడా ఇస్తున్నారనే ఊహాగానాలు చాలానే వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
Follow @TBO_Updates
Post a Comment