టాలీవుడ్ లో మరో బిగ్ ఫైట్ కు మూడు విభిన్నమైన సినిమాలు సిద్ధమయ్యాయి. సంక్రాంతికి వచ్చిన క్రాక్ వాలెంటైన్స్ డే కు వచ్చిన ఉప్పెన సాలీడ్ కలెక్షన్స్ తో నిర్మాతలకు భారీ స్థాయిలో లాభాలను అందించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు జాతి రత్నాలు, గాలి సంపత్, శ్రీకారం సినిమాలు ఒకేసారి రాబోతున్నాయి.
మార్చ్ 11న గురువారం రానున్న ఈ సినిమాల బాక్సాఫీస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్స్ పై ఒక లుక్కేస్తే.. ఈ సినిమాల్లో అన్నిటికంటే ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా శ్రీకారం. శర్వానంద్ హీరోగా నటించిన ఈ సినిమా 17.5కోట్లను అందుకుంటేనే హిట్టయినట్లు లెక్క. ఇక రాజేంద్రప్రసాద్ శ్రీ విష్ణు నటించిన గాలి సంపత్ సినిమా 7కోట్ల టార్గెట్ తో సిద్ధమైంది. ఇక అందరి ఫోకస్ ఎక్కువగా జాతి రత్నాలు సినిమాపైనే ఉంది. ఈ సినిమా 11.5కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో సిద్ధమైంది. అలాగే రాబర్డ్ అనే కన్నడ డబ్ సినిమా కూడా అదే రోజు విడుదల అవుతోంది. ఈ సినిమా 1.8కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రానుంది.
Follow @TBO_Updates
Post a Comment