మెగాస్టార్ చిరంజీవి బలమైన లైనప్ చిత్రాలతో సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఆచార్య చిత్రీకరణ పూర్తి చేసిన తరువాత, చిరంజీవి లూసిఫర్, వేధాలం రీమేక్‌లను స్టార్ట్ చేయనున్నారు, త్వరలో ఆ ప్రాజెక్టులపై ఒక క్లారిటీ ఇవ్వనున్నారు. కె.ఎస్.రవీంద్ర (బాబీ) కూడా ఒక కథను రెడీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సంవత్సరం చివరిలో ఆ న్యూ ప్రాజెక్ట్ ప్రారంభమవుతుంది.
ఈ చిత్రం యొక్క ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం దర్శకుడు బాబీ హీరోయిన్ కోసం సెర్చ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో కొంతమందిని చూసినప్పటికి మెగా స్టార్ కు సరిజోడి కుదరడం లేదట. ఇక బాలీవుడ్ లోనే ఒక బ్యూటీ ని ఫిక్స్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. సోనాక్షి సిన్హా పై ఫోకస్ ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మెగాస్టార్ తో చర్చలు జరిపి హీరోయిన్ ను త్వరలోనే ఫిక్స్ చేయనున్నట్లు టాక్.
Follow @TBO_Updates
Post a Comment