ఈ ఏడాది చెక్ సినిమాతో డిజాస్టర్ ఎదుర్కొన్న నితిన్ ఆ వెంటనే రంగ్ దే సినిమాతో కొంత పాజిటివ్ టాక్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా హిట్టవ్వడం గ్యారెంటీ అని టాక్ వచ్చింది గాని బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను ఇంకా ఫినిష్ చేయలేదు. మరో 9కోట్ల వరకు షేర్ రావాల్సి ఉంది. లేకపోతే సినిమా ప్లాప్ అయినట్లే. ఇక నెక్స్ట్ మాస్ట్రో సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే.
ఆ సినిమా తరువాత మరో ఇద్దరు దర్శకులను వెయిటింగ్ లిస్ట్ లో పెట్టినట్లు సమాచారం. కిక్, టెంపర్ వంటి కథలను అందించిన వక్కంతం వంశీతో కూడా ఒక సినిమా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. వంశీ మొదటి సినిమా నా పేరు సూర్య ప్లాప్ అవ్వడంతో మరో ఛాన్స్ దొరకలేదు. ఇక నితిన్ కు వినిపించిన కథ నచ్చడంతో ప్రాజెక్టుకు నిర్మతల నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం. త్వరలోనే ఈ కాంబినేషన్ పై అప్డేట్ రానున్నట్లు తెలుస్తోంది.
Follow @TBO_Updates
Post a Comment